GNTR: పొన్నూరు మండలం ఎంపీడీవో కార్యాలయం ప్రహరీ గోడలపై పిచ్చి మొక్కలు భారీగా పెరిగి, భవనం శిథిలావస్థకు చేరుతోంది. భవనం ముందు, వెనుక పెరిగిన మొక్కలు గోడలను బీటలు చేస్తున్నాయి. వర్షాకాలంలో వెనుక గదుల్లోకి నీరు చేరుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనంపై పెరిగిన వృక్షాలను వెంటనే తొలగించాలని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.