గుంటూరు GGH క్యాజువాలిటీ గేటు ముందు టీ షాప్ వద్ద సుమారు 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అస్వస్థతతో శుక్రవారం కుప్పకూలిపోయాడు. అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. కొత్తపేట పోలీసులు మృతదేహాన్ని GGH శవాగారంలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలన్నారు.