సత్యసాయి: ధర్మవరం సంక్రాంతి వేడుకలకు సినీ నటులు సాయికుమార్, గజల్ శ్రీనివాస్ హాజరవుతున్నట్లు బీజేపీ నేత హరీశ్ బాబు శనివారం తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో ధర్మవరం స్థానిక కళాశాల మైదానంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా రానున్నారని ఆయన తెలిపారు.