చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. పలు చెరువులు నిండిపోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా, కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.