KRNL: కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ మెన్లో శనివారం నిర్వహించిన జాబ్ మేళాలో 310 మంది నిరుద్యోగ యువత పాల్గొనగా, 104 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ అధికారి దీప్తి, DSDO ఆనంద్ పాల్గొన్నారు.