KDP: కడప టౌన్-1 నూతన సీఐగా చిన్న పెద్దయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న పూర్వపు సీఐ రామకృష్ణను ఉన్నతాధికారులు వీఆర్‌కు అటాచ్ చేశారు. ఆయన స్థానంలో శ్రీ సిటీలో సీఐగా ఉన్న చిన్న పెద్దయ్యను నియమించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాజీ పడకుండా పని చేస్తానన్నారు.