ELR: పోలవరం మండలం గూటాల గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి 68వ వార్షికోత్సవం సందర్భంగా MLA చిర్రి బాలరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు వేద పండితులు పూర్ణాహుతితో స్వాగతం పలికి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, ఏవి అప్పలరాజు, నర్రా నారాయణరావు, బండ్రెడ్డి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.