బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లి పరిసర ప్రాంతాల్లో వైరస్ ప్రభావంతో రొయ్యల చెరువులు దెబ్బతిన్నాయి. దీంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఆశించిన దిగుబడి రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర పెంచడంతో పాటు సబ్సిడీలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.