VSP: సిందియా రేపు విశాఖపట్నం అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ యూనియన్ వారు పశ్చిమ నియోజకవర్గం 40 వార్డు ఏకేసీ కాలనీలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులో ముఖ్యమైన పరీక్షలు అన్ని ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుందని, గుండె, ఊపిరితిత్తులు, కళ్లు, దంతాలు, ఇఎన్టి, షుగర్, బీపీ, ఈసీజీ ,బిఎంఐ ఎముకలకు సంబంధించిన పరీక్షలు ఇలా ఫుల్ బాడీ చెక్క్ చెసుకోవచ్చని తెలిపారు.