మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలిసారి జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుటకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇవాళ ఇంఛార్జ్ కలెక్టర్ రాజాబాబు పట్టణంలోని SVKP కాలేజీలో పలు ప్రాంతాలను పరిశీలించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోసబ్ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, తహసీల్దార్ పదేతరులు పాల్గొన్నారు.