BPT: పర్చూరు మండలం అన్నంబొట్లవారి పాలెం గ్రామంలో శనివారం పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొని రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీవో గ్లోరియా, పర్చూరు ఎమ్మార్వో బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.