PLD: వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పాల్గొన్నారు. పట్టణ, మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ స్థాయిల్లో ఇటీవల నియమితులైన నూతన సభ్యులకు వారు ప్రమాణ స్వీకారం చేయించారు.