KDP: ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో గోటూరు వెంకటేశ్ (22) అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రొద్దుటూరు రూరల్ ఎస్సై రాజు సమాచారం మేరకు ఈశ్వరరెడ్డి నగర్‌కు చెందిన వెంకటేశ్ రజక వృత్తి చేసుకుంటున్నాడు. చెట్టుకు వేలాడుతుండగా స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.