VZM: పాక్షిక దృష్టిలోపం గల ఓ వృద్ధుడు రోడ్డుపై అగమ్యగోచరంగా తిరుగుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబితకు మంగళవారం వచ్చిన సమాచారంతో.. ఆమె ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ స్పందించారు. సదరు వృద్ధుడు అప్పన్నను VZM ప్రేమ సమాజం వృద్ధాశ్రమానికి తీసుకెళ్లి ఆయన సంరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.