ATP: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు మరోసారి విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మైనర్ బాలికల పేర్లు వెల్లడించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాధవ్ ఇప్పటికే ఒకసారి విజయవాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు.