ATP: ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి శుక్రవారం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.