VZM: తెర్లాం మండలం పణుకువలస, సోమిదివలస, గొలుగువలస, కొరటాం, చిన్నగొలుగువలస గ్రామాల్లో ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా ఛైర్మన్ తెంటు లక్ష్ము నాయుడు కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గురించి ప్రజలకు వివరించారు.