EG: ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాచపల్లి ప్రసాద్ నియమితులయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులను MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ తన కార్యాలయంలో అందజేశారు. కష్టపడి పనిచేసేవారికి కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. గతంలో ఆయన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, కార్పొరేటర్‌గా పనిచేశారు.