KDP: ప్రొద్దుటూరులోని పెన్నానగర్లో రాత్రి మారెమ్మగుడి వద్ద యువకుడు నరేంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలు కాగా, తక్షణమే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 1-టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.