KRNL: ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ పనులు పూర్తి చేసి, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని DYFI జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. జిల్లాలో DYFI 46వ ఆవిర్భావ దినోత్సవంలో వారు జెండా ఆవిష్కరించి, కూటమి ప్రభుత్వం మాటల్లోనే అభివృద్ధి చూపిస్తోందని, రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.