సత్యసాయి: ఈనెల 5న జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్-టీచర్ మీటింగ్‌ను పండగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్‌తో జరిగిన జూమ్ సమీక్షలో ఏర్పాట్లను వివరించారు. విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను అందజేసి, ప్రవర్తనపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు.