VZM: ఎస్.కోట మండలం తలారి గ్రామంలో ఆత్మ వారి సహకారంతో రైతులకు శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయంపై నవధాన్యాల ఉపయోగాలపై రైతులకు స్థానిక వ్యవసాయ అధికారి కె.రవీంద్ర వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో యూరియా అధికంగా వాడకూడదని సూచించారు. నానో యూరియా వాడాలని కోరారు. ఆనంతరం రైతులకు పీఎండిఎస్ కిట్స్, కార్డ్స్ పంపిణీ చేశారు.