CTR: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఈ నెల 4వ తేదీన వీకోట పోలీసు స్టేషన్లో వేలం వేయనున్నట్టు సీఐ సోమశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 6 ద్విచక్రవాహనాలు, ఒక లగేజీ ఆటో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ముందుగా పోలీస్ స్టేషన్లో రూ.3 వేలు డిపాజిట్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.