కోనసీమ: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంకు కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని మండపేటకు చెందిన రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ కామన ప్రభాకరరావు అన్నారు. గురువారం విజయవాడలో జరిగిన సంయుక్త రాష్ట్ర కిసాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం చట్టానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అమలు చేయాలన్నారు.