GNTR: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయలో రాష్ట్ర నాయకులతో లోకేశ్ భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలకు వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు.