PLD: కోటప్పకొండలో సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు. శ్రీ త్రికోటేశ్వర స్వామిని ఆయన భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కిరణ్ మాట్లాడారు. కోటప్పకొండకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, త్వరలో విడుదలయ్యే తన సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలన్నారు.