అల్లూరి: జీఎస్ డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవో టీ.శ్రీనివాసరావు మంగళవారం కొయ్యూరు మండలంలోని బంగారమ్మపేట-1, 2 సచివాలయాలను తనిఖీ చేశారు. సచివాలయాల్లో రికార్డులను, హాజరు పట్టీని, మూవ్మెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. కౌశలం స్కిల్ టెస్టుకు సంబంధించి, రిజిస్టర్ అభ్యర్థులకు పరీక్షలు పక్కాగా నిర్వహించాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలన్నారు.