VZM: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో మంగళవారం స్థానిక విజ్జి స్టేడియంలో దివ్యాంగ క్రీడాకారులకు జిల్లా స్థాయి పోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త ఏ. రామారావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావు, అధ్యక్షులు కె. దయానంద్ లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.