W.G: తాడేపల్లిగూడెంకు చెందిన వైసీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తెన్నేటి జగ్జీవన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడికి రాజీనామా లేఖ పంపినట్లు జగ్జీవన్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో వైసీపీలో నెలకొన్న పరిణామాలు, పార్టీ విధానాలు, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.