GNTR: రెండో రోజు తెనాలిలో సాహితీ-సాంస్కృతిక మహోత్సవం వైభవంగా నిర్వహించిన మహానాట్య నీరాజనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 500 మంది కూచిపూడి నర్తకులు చేసిన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నృత్య గురువులు రమేశ్, వెంకటలక్ష్మీ, యామిని, వసంత దుర్గ, రంగనాయకి, త్రిపురసుందరీల శిష్య బృందాలు పాల్గొని ప్రశంసలు పొందారు.