SKLM: మండల కేంద్రం సార్వకోట ప్రజానీకానికి తాగునీరు అందించేందుకు ఏడాది క్రితమే పనులు ప్రారంభించారు. పైపులు కోసం కాలువలను త్రవ్వి రోడ్లను పాడుచేసారే తప్ప ఇప్పటికి పైపులైన్లు ఏర్పాటు చేయలేదని స్థానిక ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షులు గుణుపూర్ రామారావు ఆరోపించారు. తాగడానికి చుక్క నీరు అందడం లేదని, ఈ ఏడాదైనా తాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.