GNTR: వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు MLA బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు గృహ తాళాలు అందజేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. పేదల కలల సాకారానికి CM చంద్రబాబు దూరదృష్టే కారణమని, ఆర్థిక పరిమితులు ఉన్నా, ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసిందన్నారు.