KDP: ఓ వైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వేంపల్లె మండలం టీడీపీ కన్వీనర్ రామమునిరెడ్టి అన్నారు. ఆదివారం వేంపల్లి టీడీపీ కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. సిఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదన్నారు. ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.