అన్నమయ్య: రామసముద్రం చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏ. రెడ్డయ్య (35) ఆదివారం అస్వస్థతతో మృతి చెందారు. డ్యూటీలో ఉండగా అనారోగ్యానికి గురైన ఆయనను సహచర సిబ్బంది మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర ధృవీకరించారు.