అన్నమయ్య: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసిన ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ కేసులు నమోదు చేసింది. విజయవాడ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు నేతృత్వంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి, మదనపల్లె, రాయచోటి నుంచి విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వెళ్లే ట్రావెల్స్‌పై చర్యలు తీసుకున్నారు.