ప్రకాశం: ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈ నెల 5వ తేదీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్చుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వర, ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు.