TPT: సీఎం చంద్రబాబు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లా GDనెల్లూరులో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన రానున్న నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. సీఎం భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.