ప్రకాశం: కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో ఈనెల 14న జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు రూ. 10వేలు, రూ. 7వేలు, రూ. 5వేలు, రూ. 3వేలు అందజేయనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వినియోగించుకోవాలని, పీఈటీల సమక్షంలో క్రీడలు జరగనున్నాయన్నారు.