NDL: జిల్లా ఎస్పీ సునీల్ గురువారం సాయంకాలం గోస్పాడు, రేవనూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. పెండింగ్లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల తనిఖీ నిర్వహించి, రికార్డులు లేని వాహనాలకు జరిమానాలు విధించాలని సూచించారు.