మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్ రోడ్లోని చింతల సమీపంలో ఆదివారం ఓ లారీ మరమ్మతులకు గురైంది. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఇసుక లారీ ఆగిపోవడంతో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. దీంతో దోర్నాల నుంచి శ్రీశైలానికి రాకపోకలు స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.