ప్రకాశం: దొనకొండ మండలం మల్లంపేట గ్రామంలో టీడీపీ దర్శి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గురువారం తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్, ముగ్గుల పోటీలు నిర్వహిస్తామన్నారు. అందరూ పాల్గొనాలని కోరారు.