NLR: వ్యవసాయ సీజన్లో వరి నాట్లుకు పనిచేసే వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 73 అమలు చేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మండల తహశీల్దార్కి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నేత పుల్లయ్య మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు పనులు కల్పించాలన్నారు.