విశాఖ 48వ వార్డులో మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ ఆదివారం వార్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. బాపూజీ నగర్లో నిర్మాణంలో ఉన్న మినీ ఫంక్షన్ హాల్ పనులను స్థానికులతో కలిసి తనిఖీ చేసి పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం ఇందిరా నగర్-1, ఇందిరా నగర్-2, జై భారత్ నగర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.