AKP: జిల్లాలో వచ్చే నెల 15లోగా వైసీపీ అన్ని విభాగాల కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సూచించారు. బుధవారం కసింకోట మండలం తేగాడలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. కమిటీల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉగాదికి గుర్తింపు కార్డులను వారికి అందజేస్తామన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలన్నారు.