విజయనగరం జిల్లాలో అభివృద్ధి పేరుతో సేకరించిన భూములను సద్వినియోగం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి టి. సూర్యనారాయణ విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం తప్ప జిల్లాలో కొత్త పరిశ్రమలు కనిపించలేదని పేర్కొన్నారు. భూ సేకరణకు గురైన నిర్వాసితుల్లో కొందరికి ఇప్పటికీ పూర్తి పరిహారం అందలేదని ఆరోపించారు.