CTR: శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న రఘునందన్ అనే అర్చకుడిని సస్పెండ్ చేస్తూ ఈవో పెంచల కిషోర్ ఆదేశాలు జారీ చేశారు. రఘునందన్ గోదానం పేరిట మహిళను మోసం చేశాడు. దీనిపై విచారణ జరిపి అది వాస్తవ మని తేలడంతో దేవాదాయశాఖ చట్టం 30/87 కింద ఆయనను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నామని ఈవో పేర్కొన్నారు.