ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హనుమద్ వ్రతం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన అశ్వవాహనంపై కొలువు తీర్చి పట్టణంలోని పురవీధుల గుండా ఆలయం వరకు ఆంజనేయస్వామి మాలాదారులు మేళ తాళాలు నడుమ ఈ శోభయాత్ర నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.