అన్నమయ్య జిల్లాలో శేషచల అడవుల్లో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్లపై అటవీ సిబ్బంది శుక్రవారం దాడి చేశారు. వీరబల్లి మండలం తాటిగుంటపల్లి వద్ద గస్తీ సమయంలో ఇన్నోవా కారును ఆపేందుకు ప్రయత్నించగా, స్మగ్లర్లు పారిపోయారు. సిద్ధారెడ్డిగారిపల్లి వద్ద వాహనాన్ని అడ్డగించగా, అందులోని ఇద్దరు స్మగ్లర్లు తప్పించుకున్నారు.