ప్రకాశం: పెద చెర్లోపల్లి మండలంలోని దివాకరపల్లిలో రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం పరిశీలించారు. అక్కడ చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణంతో రైతులకు కౌలు లభించి, ఎంతగానో లబ్ది చేకూరుతుందన్నారు.