W.G: భీమవరం కలెక్టరేట్లో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ నిర్వహణపై కలెక్టర్ చదలవాడ నాగరాణి జిల్లా, డివిజనల్, మండల విద్యాశాఖ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 5వ తేదీన జిల్లాలో అన్ని ప్రభుత్వం పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.